Friday, April 26, 2024
- Advertisement -

త‌మ్ముడు నటన అద్భుతం: వెంకటేశ్

- Advertisement -

మ‌హేష్ బాబు తాజా చిత్రం భ‌ర‌త్ అను నేను సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తునే ఉంది. నిన్న తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ ఈ సినిమాను చూసి టీం ప్ర‌త్యేకంగా అభినందించిన సంగ‌తి తెలిసిందే.ఇప్పుడు ఈ లీస్ట్‌లోకి మ‌రో వ్య‌క్తి వ‌చ్చి చేరాడు. అత‌ను ఎవ‌రో కాదు విక్ట‌రీ వెంక‌టేష్.భ‌ర‌త్ సినిమాపై స్పందించిన వెంకీ “భరత్ అనే నేను’ సినిమా చూశాను .. మహేశ్ బాబు అద్భుతంగా నటించాడు. సున్నితమైన కథా వస్తువును కొరటాల చాలా అందంగా  బలంగా   అభినందించదగిన రీతిలో చెప్పారు.

ఇంతమంచి సినిమాను నిర్మించిన దానయ్యకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు” అంటూ ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంత‌క‌ముందు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి,ఎన్టీఆర్‌,రాంచ‌ర‌ణ్ సినిమాను అభినందించిన సంగ‌తి తెలిసిందే.సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామి సృష్టిస్తుంది. ఇప్ప‌టికే ప‌లు రికార్డ‌ల‌ను నెల‌కొల్పిన మ‌హేష్ నాన్ బాహుబ‌లిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.

https://twitter.com/VenkateshDaggu4/status/989396260326031366

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -