Monday, May 6, 2024
- Advertisement -

సూర్య‌తో వెంకీ మ‌ల్టీస్టార‌ర్‌?

- Advertisement -

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో వెంక‌టేశ్ వ‌ర‌స మల్టీస్టారర్ మూవీస్ చేస్తు మంచి జోష్‌లో ఉన్నాడు.ఇప్ప‌టికే రెండు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ చేస్తున్న వెంకీ తాజాగా మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.అయితే ఇది తెలుగు హీరోతో కాదు..త‌మిళ స్టార్ హీరో సూర్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడ‌టా వెంకీ.పూర్తి వివ‌ర‌ల్లోకి వెళ్తే…త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ క్రేజీ మల్టిస్టారర్ ను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే వెంకటేష్ , సూర్య ఇద్దరూ పోలీస్ ఆఫీసర్ పాత్రలలో క‌నిపించ‌నున్నారు.

సూర్యకు తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే.ఈ సినిమాలో సూర్య 30 నిమిషాలు మాత్ర‌మే క‌నిపించ‌నున్నార‌టా.ఇక సూర్య ఉంటాడు కాబ‌ట్టి తెలుగు,త‌మిళ భాష‌ల‌లో సినిమాను విడుద‌ల చేస్తారు.ఇప్ప‌టికే వెంకీ వ‌రుణ్ తేజ్‌తో ఎఫ్‌2 ,నాగ చైత‌న్య‌తో వెంకీ మామ సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు సినిమా పూర్తి అవ్వ‌గానే సూర్య‌తో మూవీని స్టార్ట్ చేస్తాడు మ‌న సీనియ‌ర్ హీరో.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -