Thursday, April 25, 2024
- Advertisement -

అతిధి పాత్రేనంటున్న పరిశ్రమ

- Advertisement -

విక్టరీ వెంకటేష్. హీరోగానే కాదు.. ఒక్కోసారి సాధారణ పాత్రలు చేసేందుకు కూడా వెనుకాడని నటుడు. తెలుగు సినీ పరిశ్రమలో కాసింతైనా ఈగో లేని మనిషిగా అందరూ వెంకటేష్ ని పరిగణిస్తారు. ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ చిత్రాల్లో కూడా నటించిన వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నారని తెలిసింది.

అది కూడా నాగచైతన్యకి తండ్రి పాత్రలో చేస్తున్నాడట. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో బాబు బంగారం చిత్రంలో నటిస్తున్న వెంకటేష్ త్వరలో ఈ కొత్త చిత్రంలో నటించనున్నాడు. మళయాళంలో సూపర్ డూపర్ హిట్ సాధించిన ప్రేమమ్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అందులో నాగచైతన్యకు తండ్రిగా చిన్న పాత్రలో వెంకటేష్ చేస్తారట.

అయితే వీరిద్దరికి సంబంధించిన కొన్ని షాట్లను ఇప్పటికే తీసేసారని కూడా ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది. నిజ జీవితంలో మామ అల్లుళ్లైన వీరిద్దరు వెండితెరపై కనిపిస్తే ఎలా ఉంటుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -