Monday, April 29, 2024
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికలపై బిజెపి కసరత్తు

- Advertisement -

ఉత్తర్ ప్రదేశ్. దేశంలో పెద్ద రాష్ట్రం. ఇక్కడ వచ్చే సంవత్సరం శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి తన ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రకటించాలని భావిస్తోంది. పార్టీ అత్యున్నత స్ధాయి సమావేశంలో దీనిపై చర్చించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బిజెపి పట్టుదలగా ఉంది.

దీంతో గతంలో అంటే 2000 సంవత్సరంలో ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజ్ నాథ్ సింగ్ ను సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఇక్కడ విజయం సాధించవచ్చునని పార్టీ భావిస్తోంది. 2014 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజ్ నాథ్ సింగ్  యుపి పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు.  ఆ సమయంలో పార్టీ ఘన విజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

దీంతో అక్కడ శాసనసభ ఎన్నికల్లో సిఎం అభ్యర్ధిగా రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రకటిస్తే మంచిదని పార్టీ భావిస్తోంది. అయితే ఇక్కడ సిఎం రేసులో కేంద్ర మంత్రులు ఉమా భారతి,  స్మృతి ఇరానీ ఉన్నారు. వీరితో పాటు పార్టీ నాయకులు వరుణ్ గాంధీ, యోగి ఆదిత్య నాథ్ కూడా పోటీ పడుతూండడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -