Saturday, May 11, 2024
- Advertisement -

డొనాల్డ్ పై హిల్లరీ ట్విట్

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసకందాయంలో పడుతున్నాయి. ఇక్కడ అధ్యక్ష రేసులో ఉన్న వారు ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపుతున్నారు. తాజాగా డెమక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా ఖరారైన హిల్లరి క్లింటన్ తన ప్రత్యర్ధి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ పై ఓ ట్విట్ చేశారు. అదేంటంటారా.. ట్రంప్ నీ ఖాతా మూసేయ్ అని ట్విట్ చేశారు.

దీంతో ఇది అమెరికాలో పెద్ద జోక్ గా మారిపోయింది. అయితే హిల్లరి ఈ ట్విట్ ను తన ఖాతా నుంచి కాకుండా తన సహాయకుల్లో ఒకరి ట్విట్టర్ ఖాతా నుంచి చేయడం విశేషం. అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు లక్షల రీ ట్విట్ సాధించిన ట్విట్ కూడా ఇదే కావడం విశేషం. దీని ద్వారా కూడా హిల్లరీ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉద్దేశించి ట్రంప్ చేసిన ఓ వ్యాఖ్యకు ఇది సమాధానంగా అమెరికన్లు భావిస్తున్నారు.

అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ పని అయిపోయిందని, ఇక తన ట్వట్టర్ ఖాతాను మూసుకోవాల్సిందేననే అర్ధంలో హిల్లరి ఈ కామెంట్ చేసారు. దీనిపై రిపబ్లిక్ పార్టీ కూడా స్పందించింది. ట్విట్ గురించి ఏమి మాట్లాడని పార్టీ దాన్ని చేసిన పద్దతిపై మాత్రం స్పందించింది. అధ్యక్ష ఎన్నికల్లో ఉన్న అభ్యర్ధి ఇలా మరొకరి ఖాతా నుంచి ట్విట్ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ఇప్పటి వరకూ అమెరికాలో యువ ఓటర్లకు దూరమయ్యారని భావిస్తున్న హిల్లరీ ఈ ఒక్క ట్విట్ తో వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -