Monday, May 6, 2024
- Advertisement -

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’కు వెంకీ వాయిస్ ఓవ‌ర్‌

- Advertisement -

నితిన్‌,రాశీ ఖ‌న్నా హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన‌ సినిమా శ్రీనివాస కళ్యాణం.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని వ‌చ్చే వారం విడుద‌ల‌కు రెడీ అవుతుంది.పెళ్లి వేడుక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సీనియర్‌ హీరో, విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ అప్ప‌ట్లో న‌టించిన శ్రీనివాస కళ్యాణం ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.

లై , ఛల్‌ మోహన్‌ రంగ సినిమాలతో నిరాశపరిచిన నితిన్‌.. శ్రీనివాస కళ్యాణం మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. శతమానం భవతి చిత్ర ద‌ర్శ‌కుడు సతీష్‌ వేగేశ్న ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు.ప్రకాష్ రాజ్, జయసుధ, నందిత శ్వేతలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -