- Advertisement -

విషాదంలో మునిగిన వేణు మాధవ్ కుటుంబం

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్న వేణుమాధవ్‌ ఇంటిని విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సోదరుడు విక్రమ్‌ బాబు గుండెపోటుతో మృతి చెందారు. స్థిరాస్తి వ్యాపారిగా పని చేస్తున్న 54 ఏళ్ల విక్రమ్ బాబు సినిమా ఇండస్ట్రీ లో డా సుపరిచితుడే. కొన్ని చిత్రాలకు సహ నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. కాప్రాలోని హెచ్‌బీ కాలనీ మంగాపురంలో ఆయన నివాసం ఉంటున్న విక్రమ్ బాబు ఘటన జరిగే తొమ్మిది రోజుల ముందే తన కూతురు వివాహాన్ని ఘనంగా జరిపించారు.

జూన్ 28 రాత్రి గుండెపోటు రావడంతో వెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుప్రతిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన ఆఖరి శ్వాస విడిచారు. విక్రమ్‌ బాబుకు భార్య, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ఆయన హఠాన్మరణం తో స్థానిక కార్పొరేటర్‌ అంజయ్య, పలువురు స్థిరాస్తి వ్యాపారులు, టీఆర్‌ఎస్ నేతలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. విక్రమ్ బాబు అంత్యక్రియలు శనివారం సాయంత్రం లక్ష్మీనగర్‌ శ్మశానవాటికలో జరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -