సీనియర్‌ నటి కన్నుమూత

బాలీవుడ్ సీనియర్‌ నటి రీటా భాదురి ఈ రోజు ఉద‌యం మ‌ర‌ణించారు. గత కొంతకాలంగా వయసురిత్యా సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఐదు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సుమారు 400 చిత్రాల్లో ఆమె నటించారు. అమ్మ, అమ్మమ్మ పాత్రలకు ఆమె పెట్టింది పేరు.

కబీ హాన్‌ కబీ నా, క్యా కహెనా, దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌, మై మాధురిదీక్షిత్‌ బన్‌నా చాహితీ హూ.. తదితర చిత్రాలతో రీటా మంచి గుర్తింపు పొందారు. హిందీతోపాటు పలు గుజరాతీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ఆమె మృతికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం అంధేరీలో ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు.