Friday, May 17, 2024
- Advertisement -

గిడ్డి ఈశ్వరి ఫైటింగ్ ట్రెండింగ్

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ నుంచి విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యేగా గెలిచి, పార్టీ ఫిరాయించి, టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి టైం బాగోలేదు. ఆమె నోరెత్తినా, చేయెత్తినా, గట్టింగా వార్నింగ్ ఇచ్చినా, మనసులో మాట సన్నిహితులతో చెప్పుకున్నా క్షణాల్లో వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చేస్తున్నాయి. తన అన్న భార్య విజయలక్ష్మితో గిడ్డి ఈశ్వరి ఫైటింగ్ చేసిన వీడియో ఆదివారం ఉదయం నుంచీ ట్రెండింగ్ అయిపోతోంది. తమ స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదినతో ఆమె భూమికి సంబంధించి గొడవపడ్డారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరి కింద పడిపోయారు. తర్వాత తనంతట తానే లేస్తూ నువ్వు నన్ను కొట్టకు,, ఇక్కడ నుంచి నువ్వు వెళ్లిపో..అంటూ ఆమెను తోసేసే ప్రయత్నం చేశారు. రాజకీయాలు చేస్తే పాతేస్తా. నువ్వే వెధవ రాజకీయాలు అన్నీ చేశావ్, నీకు సంబంధం లేని విషయం నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో. వద్దు, ఇక్కడ నుంచి వెళ్లిపో, వెళ్లిపో, రాజకీయాలు చేస్తే పాతేస్తాను. నువ్వు ఎంటరయ్యావంటే పాతేస్తాను..అంటూ తన వదినతో పాటు వీరి గొడవను ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తినీ తోసేస్తూ ఈశ్వరి వార్నింగ్ ఇచ్చారు. అయితే తమ భూమి ఆమె కబ్జా చేసిందని, ఆ స్థలంలో చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఇలా దాడి చేసి తరిమేస్తోందని సోదరుడి భార్య ఆరోపిస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎమ్మెల్యే కనుక పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. గిడ్డి ఈశ్వరి సంగతి ఇక చంద్రబాబు వద్దే తేల్చుకుంటానని ఆమె చెబుతోంది.

అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఆ మధ్య గిడ్డి ఈశ్వరి చంద్రబాబు మీద షాకింగ్ కామెంట్లు చేసి అడ్డంగా బుక్కయిపోయారు. ఆ మధ్య అంటే ఆమె వైఎస్ఆర్ సీపీలో ఉన్నప్పుడు కాదు. అప్పుడెటూ ప్రతిపక్షంలో ఉంది కనుక ఆరోపణలు, విమర్శలు, సవాళ్లు సహజమే. కానీ ఆమె వైఎస్ఆర్ సీపీకి గుడ్ బై చెప్పేసి, టీడీపీలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో టీడీపీలో కలకలం రేపాయి. ఫ్యాను గుర్తుపై గెలిచి, టీడీపీలో చేరడమేంటని ఆమె నియోజకవర్గ ప్రజలు, వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు గిడ్డి ఈశ్వరిని గట్టిగా నిలదీశారు. నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. దీంతో వారికి గిడ్డి ఈశ్వరి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది.

అబ్బే… నేనేం చంద్రబాబు మీద ప్రేమతో టీడీపీలో చేరలేదు. ఆయనంటే నాకూ ఇష్టం లేదు.. మంత్రి పదవి ఇస్తారు. అభివృద్ధి పనుల కోసం దండిగా నిధులు ఇస్తారు. అనే చేరాను. అంతేకాని చంద్రబాబు ముఖం చూసి చేరలేదు. అంటూ ఆమె చేసిన కామెంట్లు సెల్ ఫోన్ లో ఓ వ్యక్తి రికార్డ్ చేశారు. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు సహా టీడీపీ నేతలందరికీ చేరిపోయింది. దీంతో ఆ పార్టీ నుంచి ఆమెకు సహకారం తగ్గిపోయింది. అటు వైఎస్ఆర్ సీపీకి ఇటు టీడీపీకి దూరమై అప్పటి నుంచీ మీడియాకు దూరంగా ఉంటోంది గిడ్డి ఈశ్వరి. కానీ ఇన్నాళ్లకు ఈ ఫైటింగ్ వీడియో మళ్లీ ఆమెను వార్తల్లోకి తెచ్చింది. ఆమెతో గొడవపడ్డ మహిళ నేరుగా చంద్రబాబుకే ఫిర్యాదు చేస్తాను. అనటంతో ఇప్పుడు గిడ్డి ఈశ్వరి తల పట్టుకుంటోంది. అసలే గతంలో ఆయనపై తాను చేసిన వ్యాఖ్యలతో మంత్రి పదవి కాదు కదా, నిధులు కూడా అడగటానికి ముఖం చెల్లట్లేదు. ఇప్పుడు ఈ ఫైటింగ్ వీడియో ట్రెండింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫిర్యాదు చేస్తే తన పరిస్థితి ఏంటని భయపడుతోంది. మరోవైపు మా కుటుంబ సమస్య దీన్ని సోషల్ మీడియాలో చర్చ చేస్తున్నారు. లైట్ తీస్కోండి అని గిడ్డి ఈశ్వరి తీసి పారేస్తున్నారు. ఓ వైపు మాత్రం ఈ సెల్ ఫోన్లు ఏంటిరా బాబూ..నాడు, నేడు నన్ను అడ్డంగా బుక్ చేసేశాయ్ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -