Sunday, May 12, 2024
- Advertisement -

విక్కీ కౌశల్ నిర్ణయం, పవన్ ఫాన్స్ కి సంతోషం

- Advertisement -

తమిళ్ సినిమా పరిశ్రమ లో పెద్ద విజయం సాధించిన సినిమా వీరం. అజిత్ ప్రధాన పాత్ర లో వచ్చిన ఈ సినిమా కి దర్శకుడు శివ. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కథ నచ్చి కచ్చితంగా రీమేక్ చేయాలనే తలంపు తో ఉండి, సినిమా ని తెలుగు లో చేసాడు. కాకపోతే తమిళం లో విజయం సాధించినంత గొప్ప గా ఈ సినిమా తెలుగు లో విజయం సాధించలేదు. ఈ సినిమా ని తెలుగు లో కాటంరాయుడు పేరు తో డాలీ దర్శకత్వం చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా హిందీ లో రీమేక్ కానుంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు విక్కీ కౌశల్ ఈ సినిమా హిందీ రీమేక్ లో నటించనున్నాడు. సాజిద్ నదియాడ్వాలా ఈ సినిమా ని హిందీ లో నిర్మించనున్నాడు. ఇంకా ఈ సినిమా కి దర్శకుడు ఖరారు కాలేదు. అలాగే ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనే దాని మీద కూడా క్లారిటీ లేదు. అయితే వికీ కౌశల్ హిందీ లో ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతున్నాడు. పవన్ సినిమా ని హిందీ లో చేస్తున్నాడు అనగానే పవన్ ఫాన్స్ చాలా మంది హాపీ గా ఫీల్ అయ్యి విక్కీ కి సుభాక్సంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -