Friday, May 3, 2024
- Advertisement -

ఆసిస్‌కు రిట‌ర్న్ గిప్ట్ ఇచ్చిన టీమిండియా….

- Advertisement -

ప్రపంచకప్‌లో భారత్ విజయాల వేట మొదలైంది. ఆది వారం ఓవల్‌ వేదికగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో కోహ్లి సేన జయభేరి మోగించింది. వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది.బ్యాట్స్‌మెన్ సమష్టిగా కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన 50 ఓవర్లలో 5 వికెట్లకు 352 పరుగులు చేసింది.

మొద‌ట టాస్ గెలిచి కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. శిఖర్ ధవన్ (109 బంతుల్లో 117; 16 ఫోర్లు) సెంచరీతో చెలరేగితే.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (77 బంతుల్లో 82; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (70 బంతుల్లో 57; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో అదరగొట్టారు. చివర్లో హార్దిక్ పాండ్యా (27 బంతుల్లో 48; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), మహేంద్ర సింగ్ ధోనీ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో భారత్ భారీ స్కోరు చేసింది. టీమిండియా టాప్ ఆర్డ‌ర్ స‌మిష్టిరాణించ‌డంతో ఈ విజ‌యం న‌మోద‌య్యింది. మొద‌టి మ్యాచ్‌లో పెయిల్ అయ‌ని గ‌బ్బ‌ర్ ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.ఆసీస్‌ బౌలర్లలో స్టోయినిస్‌ రెండు వికెట్లు సాధించగా, కమిన్స్‌, స్టార్క్‌, కౌల్టర్‌ నైల్‌లకు తలో వికెట్‌ లభించింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 316 పరుగులకే ఆలౌటై ప్రపంచకప్‌లో తొలి ఓటమిని నమోదు చేసింది. డేవిడ్ వార్నర్ (56), అరోన్ ఫించ్ (36), స్టీవెన్ స్మిత్ (69), ఉస్మాన్ ఖావాజా (42), అలెక్స్ కేరీ (55)లు క్రీజులో ఉన్నంత సేపు భారత్‌ను భయపెట్టారు. ఒకానొక దశలో ఆసీస్‌ లక్ష్యం ఛేదించేలా కనిపించింది. 36.4 ఓవర్లలో మూడు వికెట్లకు 202 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. అయితే 40వ ఓవర్లలో భువనేశ్వర్‌ మ్యాచ్‌ స్వరూపానే మార్చేశాడు. ఒకే ఓవర్లో జోరు మీదున్న స్మిత్‌ను, స్టొయినిస్‌ను పెవిలియన్‌కు పంపించాడు. దీంతో మ్యాచ్‌ టీమిండియా చేతుల్లోకి వచ్చింది.ఒకానొక దశలో విజయం దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించారు.అనంతరం బుమ్రా, భువీలు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆసీస్‌ ఓటమి ఖాయమైంది.

భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలు చెరో మూడు వికెట్లు తీసి కంగారూలకు కళ్లెం వేశారు. చాహల్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సెంచరీతో భారత విజయానికి బాటలు వేసిన శిఖర్ ధవన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. కాగా, భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 13న న్యూజిలాండ్‌తో ఆడనుంది. గత ప్రపంచకప్ ఓటమికి బదులు తీర్చుకుంది భారత్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -