‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ ‘లగేరహో మున్నాభాయ్’ వంటి సంచలన సినిమాల నిర్మాత విధూవినోద్ చోప్రా తొలిసారి హాలీవుడ్ లో ప్రయత్నం చేశాడు. దర్శకుడిగా మారి ‘బ్రోకెన్ హార్సెస్’ అనే సినిమాను రూపొందించాడు.
ఒక భారతీయుడు రూపొందించిన హాలీవుడ్ సినిమా కావడంతో దేశంలో కూడా ఈ సినిమా పట్ల ఆసక్తి కనిపించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. అని ఆరాలు తీస్తే.. హాలీవుడ్ సీసాలో పోసిన బాలీవుడ్ సినిమా! అనే టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు అంతగా కనిపించడం లేదు. ఈ సినిమా బాలీవుడ్ లో ఇది వరకూ విధూ రూపొందించిన ‘పరిందా’ సినిమాకు కొనసాగింపులా ఉంటుందట. ఈ సినిమా విడుదలకు ముందే అభిప్రాయాలు వినిపించాయి. ట్రైలర్ గట్రా చూసి.. ఇది అచ్చం పరిందా సినిమాలాగే ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. తీరా విడుదలయ్యాకా చూస్తే.. ఈ సినిమా ఆ సినిమా రెండూ ఒకటే ప్లాట్ పారమ్ అని విశ్లేషకులు అంటున్నారు.
సినిమా అంత గొప్పగా లేదని.. బాలీవుడ్ ఫార్ములాను హాలీవుడ్ వర్కవుట్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగిందని సినీ ఎనలిస్టులు అంటున్నారు. ఇండియన్ సినిమా వరకూ విధూవినోద్ చోప్రా అదుర్స్ అనిపించుకొన్నాడు. నిర్మాతగా ఇతడి టేస్ట్ కు ప్రశంసలు దక్కాయి. జాతీయ అవార్డులు కూడా దక్కాయి. మరి ఈయన హాలీవుడ్ జర్నీకి మాత్రం మరీ అంత అప్లాజ్ రావడం లేదు!
