Thursday, May 2, 2024
- Advertisement -

ఇలా అయితే కొహ్లీ కి కెప్టెన్సీ దక్కడం కష్టమే!

- Advertisement -

ఒక్కసారి ఇండియన్ క్రికెట్ టీమ్ చరిత్రను చూస్తే.. కెప్టెన్లుగా వ్యవహరించిన వారిలో ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది.

అద్భుతమైన నాయకత్వ లక్షణాలున్న వారు ఇండియన్ క్రికెట్ టీమ్ కు కెప్టెన్లుగా వ్యవహరించారు. వారిని వివాదాలు వెన్నంటినీ.. వారు కెప్టెన్ గా ఒక రేంజ్ కు ఎదిగాకే.. వివాదాల్లో తలదూర్చారు. అయితే అదిలోనే వివాదాలను కొని తెచ్చుకొని ఎదిగిన వారు మాత్రం కనపడరు. మరి ఇలాంటి పరిస్థితులున్న టీమ్ తరపున విరాట్ కు భవిష్యత్తులో కెప్టెన్ గా ఎదిగే  అవకాశాలున్నాయా? అనే సందేహాలు వినిపిస్తున్నాయిప్పుడు.

ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా ఉన్న విరాట్ వ్యవహరిస్తున్న తీరు అతడికి కెప్టెన్సీ పగ్గాలు దక్కనీయకుండా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విరాట్ లెక్కకు మించి వివాదాల్లో తలదూర్చాడు. వ్యక్తిగతంగా దురుసు ప్రవర్తన.. దానికి తోడు గర్ల్ ఫ్రెండ్ వ్యవహారం విరాట్ కెప్టెన్సీ కలలకు అడ్డంకులుగా మారే అవకాశాలున్నాయి.
ఇటీవలే విరాట్ ఒక మ్యాచ్ కు కెప్టెన్సీ చేసి ఓపెనర్ ధావన్ తో గొడవపెట్టుకొన్నాడు. సరిగా బ్యాటింగ్ చేయడం లేదని డ్రెస్సింగ్ రూమ్ లో ధావన్ పై విరాట్ నోరు పారేసుకొన్నట్టుగా తెలుస్తోంది. దానికి ధావన్ కూడా ధీటుగానే బదులిచ్చాడట. అంతకు ముందే  మైదానంలో ఒకసారి ప్రేక్షకులను గేలి చేస్తూ మిడిల్్ ఫింగర్ చూపడం.. ఐపీఎల్ మ్యాచ్ లో గంభీర్ తో గొడవపెట్టేసుకోవడాలు విరాట్ మనస్తత్వాన్ని తేటతెల్లం చేశాయి.
ఇక ఇప్పుడు హీరోయిన్ , తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను వెనకేసుకు వస్తూ విరాట్ టీమ్ తనంత బాగా ఆడే ఆటగాడు ఎవరూ లేరని.. అలాంటిది తను ఒక మ్యాచ్ లో సరిగా ఆడకపోతే నాపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించాడు. మరి ఇది సరైన తీరు కాదు. తనలాగా ఎవరూ ఆడటం లేదు.. ఐదేళ్ల నుంచి తనే జట్టును దగ్గరుండి గెలిపిస్తున్నానని విరాట్ చెప్పుకొచ్చాడు. మరి విరాట్ నిజంగానే జట్టును గెలిపిస్తున్నా.. అలా చెప్పుకోవడం అయితే సరికాదు!
ఇలా మాట్లాడటం విరాట్ కు మైనస్ పాయింటే. మరి ఇలాంటి వ్యక్తికి కెప్టెన్ గా పగ్గాలు దక్కడం జరుగుతుందా?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -