- Advertisement -

తాజ్ మహల్ హిందూ దేవాలయమా!

- Advertisement -

ప్రపంచ వింతల్లో ఒకటిగా.. షాజహాన్ కు తన భార్యపై ఉన్న ప్రేమకు నిలయంగా.. సింబల్ ఆఫ్ లవ్ గా పేరున్న తాజ్ మహల్ గురించి వివాదం ఇప్పటికి కాదు.

తాజ్ మహల్ ను షాజహాన్ నిర్మింపజేయలేదని..అది హిందూ రాజ్ మహల్ అని అంటారు కొంతమంది. దానికి అనేక ఆధారాలు కూడా చూపుతూ ఉంటారు. తాజ్ మహల్ నిర్మాణం హిందూ వాస్తుకళకు ప్రతిరూపమనేది ప్రముఖమైన వాదన.
ఇలాంటి నేపథ్యంలో తాజాగా ద్వారక పీఠాధిపతి శంకరాచర్య స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యానాలే చేశారు. తాజ్ మహల్ ఒక శివాలయం అని ఆయన తేల్చారు. తాజ్ మహల్ కింద శివాలయం ఉందని.. అందులో దేవదేవుడైన శివుడి రూపం ఉంటుందని  ఈయన చెప్పారు.
అక్కడ క్రీస్తు శకం 1156లొ దేవాలయ నిర్మాణం జరిగిందని.. ఆ తర్వాతి కాలంలో మొఘలులు ఆక్రమించుకొన్నారని..  తాజ్ మహల్ షాజహాన్ చేతికి  క్రీస్తు శకం 1631లో వచ్చిందని.. అప్పటికి దేవాలయంలో అగ్రేశ్వర్ మహరాజ్ ఉండేరవాని  ఈ స్వాములోరు అంటున్నారు.
మరి ఇది రాజకీయంగా కూడా చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఇది వరకూ ఈ స్వాములోరు షిరిడీ సాయిబాబా గురించి కూడా వ్యాఖ్యానాలు చేశారు. సాయిబాబా దేవుడు కాదని.. గొడ్డుమాంసం తిన్న వ్యక్తిని హిందువులు ఎలా పూజిస్తారని పీఠాధిపతి ప్రశ్నించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -