Monday, May 13, 2024
- Advertisement -

అంతర్జాతీయ క్రీడారంగానికి ప్రతినిధిగా సల్మాన్

- Advertisement -

బాలీవుడ్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఎంతో అరుదైన గౌరవం దక్కింది. ఈ సంవత్సరం రియోలో జరుగనున్న ఒలింపిక్స్ కు సల్మాణ్ ఖాన్ గుడ్ విల్ అంబాసిడర్ నియమితులయ్యారు.

సమ్మర్ ఒలింపిక్స్ కు బాలీవుడ్ స్టార్ ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. సల్మాన్ ఖాన్ గతంలో ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్ ల సందర్భంగా స్టేడియంల కనిపించి అభిమానులకు కనువిందు చేశాడు. అయితే రియో ఒలింపిక్స్ కు ప్రతినిధిగా వెళ్లడం నిజం గొప్ప గౌరవమే. ఈ విషయాన్ని ఢిల్లీలో భారత ఒలింపిక్స్ విభాగం ప్రకటించింది.

సల్మాన్ తో పాటు మేరీకోమ్, సర్దార్ సింగ్, రితు రాణి, దీపికా కుమారి, అపూర్వి చండేలా, మనికా బాత్రా వంటి ప్రముఖ క్రీడాకారులు కూడా రియో ఒలింపిక్స్ లో పాల్గొంటున్నారు. ఈ పోటీలు ఆగస్టు 5 నుంచి రియోలో జరుగుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -