Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో బాల‌య్య స‌ర‌స‌న బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌..

- Advertisement -

తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు, అన్న, నటదిగ్గజం ఎన్టీఆర్ జీవితంపై తెలుగులో సినిమా రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలయ్య న‌టించ‌నున్నారు. ఈ సినిమాను భారీస్థాయిలో నిర్మించేందుకు బాల‌య్య సిద్ద‌మ‌వుతున్నారు. తేజా డైరెక్స‌న్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

అయితే ఎన్టీఆర్‌కు జోడీగా బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా పాత్ర‌లో బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గా 62 గెటప్ లలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాల‌న్‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలుస్తోంది. విభిన్న పాత్రలతో దూసుకుపోతున్నా విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పటి పాత్ర కోసం శర్వానంద్ ని ఎంపిక చేసారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వివరాలపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం క్లారిటీ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -