Saturday, May 18, 2024
- Advertisement -

కామసూత్రపై అమ్మడు ఏం చెప్పిందో చూశారా

- Advertisement -

కామసూత్ర. యాడ్ గానే కాకుండా… అడల్ట్ మూవీగాను ,సెక్స్ ఎడ్యుకేషనల్ మూవీగాను పేరొందిన చిత్రం. ఈసినిమా ఎప్పుడొచ్చిన ఎవరు తీసినా కాసుల వర్షం కురుస్తూనే ఉంటుంది. తాజాగా బిటౌన్ వెర్సటైల్ బ్యూటీ విద్యాబాలన్.. కన్ను ఈసారి శృంగారంపై పడింది. బేసిగ్గా సిన్సియర్ అండ్ బోల్డ్ కామెంట్స్ కి పెట్టింది పేరైన విద్య…. ఉన్నదున్నట్లు మొఖంపైనే చెబుతుంటుంది.

మన దేశంలో శృంగారంను కేవలం పెళ్లి, సంతానం కోణంలో మాత్రమే చూడటం దురదృష్టకరం అంటోంది విద్య. భారతీయ సంస్కృతి అలా స్థిరపడిపోయిందని, అక్కడే ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ”సెక్స్ అనేది ఒక క్రియ మాత్రమే కాదు, అదొక భావన” అంటూ తనదైన భాష్యం చెప్పుకొస్తోంది.

ఏకాంతంలో కలిగే ఆనందం, ఆహ్లాదంతో ముడిపడిన ‘అందమైన సెక్స్’ని ఇండియన్లు దూరం చేసుకుంటున్నారన్నది విద్య బాధ. ఇప్పటికైనా హిపోక్రసీ వదిలిపెట్టి.. సెక్స్ అనే అంశాన్ని ఒక నిషేదిత అంశంగా చూడటం మానేసి.. పిల్లల్లో కూడా మంచి అవగాహన ఏర్పడేలా ప్రయత్నించాలన్నది విద్యాబాలన్ సూచన.మరి దీనికి ప్రభుత్వాలు ఏమంటాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -