Saturday, May 4, 2024
- Advertisement -

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్ చేస్తా

- Advertisement -

విద్యాబాలన్. గ్లామర్ తో పాటు నటనను కూడా సొంతం చేసుకున్న హీరోయిన్. సామాజిక కార్యక్రమాల్లో కూడా విద్యాబాలన్ ముందుంటారు. బీ యువర్ సెల్ఫ్ అంటూ యువతను ఉత్తేజ పరిచే విద్యాబాలన్ ఇప్పటి వరకూ హైదరాబాద్ బిర్యానీ తినలేదు అన్నారు. నేను ఎన్నో సార్లు హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ మా  అత్తయ్య, మావయ్య ఉన్నారు.

అయినా నేను హైదరాబాద్ బిర్యానీని రుచి చూడలేదు. ఎందుకంటారా.. నేను పూర్తి శాఖాహారిని. ఇక్కడికి వచ్చినప్పుడు వెజ్ బిర్యానీ రుచి చూసాను అంతే అని ఆమె ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ప్రస్తుతం ఏక్ అల్బేలా చిత్రంలో నటిస్తున్న విద్యాబాలన్ త్వరలో మహా గాయకురాలు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ లో నటించాలనుకుంటోంది.

ఇంతకు ముందు ఒకసారి ఈ అవకాశం వచ్చింది. అయితే చేజారిపోయింది. ఈ సారి మాత్రం అవకాశం వస్తే వదలను. తప్పకుండా నటిస్తా అన్నారు. ఇక తెలుగులో తనకు మంచి కథ ఉన్న ఆఫర్లు రావడం లేదని, వస్తే మాత్రం తెలుగులో తప్పకుండా నటిస్తానంటూ చెప్పింది విద్యాబాలన్. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -