Wednesday, May 1, 2024
- Advertisement -

జాతీయ జెండా ఆవిష్కరించిన కెసిఆర్

- Advertisement -

తెలంగాణ అంతటా సంబురాలు. తెలంగాణ అంతటా వేడుకలు. తెలంగాణ అంతటా ఉత్సవాలు. తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ, తెలంగాణ జిల్లాల్లోనూ ఈ వేడుకల్లో మంత్రులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర రావు తెలంగాణ అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించారు.

అనంతరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో పోలీసుల గౌరవ వందన్నాన్ని స్వీకరించారు. అతి పెద్దదైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలికల వివాహాల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇక విద్యార్ధులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్న ఘనత తమ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.

ప్రాజెక్టుల రీ డిజైన్ తో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు. దసరాలోపు తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని కెసిఆర్ అన్నారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారని, మిగిలిన జిల్లాల్లో కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తామని ఆయన అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -