Thursday, May 16, 2024
- Advertisement -

మళ్ళీ కలిసి రానున్న విజయ్-రష్మిక ?

- Advertisement -

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ మొదటి సారి గా గీత గోవిందం అనే సినిమా లో మనకి కనిపించింది. ఈ సినిమా లో వీళ్ళ ఇద్దరు చేసిన నటన మనల్ని ఎంతగానో అలరించింది. వారి కెమిస్ట్రీ కూడా చక్కగా కుదిరింది అని చెప్పుకోవచ్చు. అయితే రెండో సారి ఈ ఇద్దరు నటీ నటులు కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా లో నటించారు. ఈ సినిమా నిన్న నే విడుదల అయ్యి మంచి పేరు సంపాదించింది. మళ్ళీ విజయ్, రష్మిక చేసిన నటన కి, వారి కెమిస్ట్రీ కి మంచి పేరు వచ్చింది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక లో మాట్లాడుతూ తన తో రష్మిక మళ్ళీ సినిమా చేస్తుందని చాలా మంది రూమర్స్ పుట్టించారు అని రష్మిక గురించి విజయ్ చెప్పాడు. రష్మిక కూడా విజయ్ తో రెండో సారి నటిస్తున్నందుకు తన పేరెంట్స్ మొదట ఒప్పుకోలేదు అని చెప్పింది.

ఈ నేపథ్యం లో త్వరలో విజయ్ సరసన మళ్ళీ రష్మిక కనిపించనుందట. ఇప్పటికే విజయ సరసన మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను అని చెప్పిన రష్మిక ఇంకో అవకాశం వస్తే వదులుకునేందుకు సిద్ధం గా లేదు అనే విషయం అవుతుంది. త్వరలో విజయ్ సైన్ చేయనున్న ఒక భారీ ప్రాజెక్ట్ కోసం రష్మిక ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -