Thursday, May 23, 2024
- Advertisement -

జ‌మ్ము కాశ్మీర్‌పై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న కేంద్రం…

- Advertisement -

జ‌మ్మూ,కాశ్మీర్ లో ఉగ్ర‌వాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా భాగంగానే 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను జమ్మూకశ్మీర్‌కు పంపాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల కశ్మీర్‌ లోయలో రెండు రోజులు పర్యటించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్‌ అక్కడి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. వెంట‌నె అద‌న‌పు బ‌ధ్ర‌తా బ‌ల‌గాల మోహ‌రింపు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైనికులను విమానాల్లో జమ్మూ కశ్మీర్‌కు తరలించనున్నట్లు సమాచారం. కశ్మీర్ లోయలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక చర్యలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. అమర్‌నాథ్‌ యాత్ర నేపథ్యంలో ఇటీవలే దాదాపు 40వేల మంది అదనపు బలగాలు రాష్ట్రానికి పంపింది.

జమ్మూకశ్మీర్‌కు 10 వేల మంది అదనపు పారామిలటరీ బలగాలను తరలించడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రజలకు భయబ్రాంతులకు గురి చేసేందుకే అదనపు బలగాలను తరలిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు బాగానె ఉన్నాయ‌ని అద‌న‌పు బ‌ల‌గాలు అవ‌స‌రం లేద‌ని మండిప‌డింది. రాష్ట్రంలో రాజకీయ సమస్యలు ఉన్నాయని, వాటిని బలగాలతో పరిష్కరించలేరన్నారు. ఈ విష‌యంలో కేంద్రం మ‌రోసార పున‌రాలోచ‌న చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -