Saturday, May 18, 2024
- Advertisement -

రిటైర్మెంట్‌పై ధోని వెన‌క్కు త‌గ్గ‌డానికి కార‌ణం అత‌నేనా ..?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్‌లో పేవ‌ల బ్యాటింగ్‌తో ధోని రిటైర్మెంట్ చేయాల‌ని అన్ని వైపుల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసందే. అయితే ఇప్ప‌ట్లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించే ఆలోచ‌న లేద‌ని ధోని క్లారిటీ ఇచ్చారు. ధోని వెనుక‌డుగు వేయ‌డం వెనుక కెప్టెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడ‌నె వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాస్తవానికి ప్రపంచకప్‌ అనంతరమే ధోని ఆటకు గుడ్‌బై చెప్పాలని భావించాడని, కానీ కోహ్లి విన్నపం మేరకు ఆగాడని భారత కెప్టెన్‌ సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

ఇంత అత్యవసరంగా రిటైర్మెంట్‌ తీసుకోవద్దనే కోహ్లి విన్నపంతోని ధోని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ధోనికి ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్యల్లేవని, అతను 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు కొనసాగగలడని కోహ్లి భావిస్తున్నాడంట‌. అత్య‌వ‌స‌రం అయిన‌పుడు ధోని సేవ‌లు వినియోగించుకోవ‌చ్చ‌నె ఆలోచ‌న‌లో కోహ్లీ ఉన్న‌ట్లు స‌మాచారం. భ‌విష్య‌త్ అవ‌స‌రాల దృష్ట్యా పంత్‌ను సిద్దం చేసెప‌నిలో ప‌డ్డారు సెల‌క్ట‌ర్లు.

పంత్‌ గాయపడ్డా.. ఫామ్‌ కోల్పోయినా.. ప్రత్యామ్నయంగా ధోని ఉపయోగపడుతాడని, అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగదు.’ అని కోహ్లి భావిస్తున్నట్లు స‌మాచారం. ఏది ఏమైనా ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం భార‌త జ‌ట్టుకు ఎంతో ఉప‌యేగం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -