Monday, May 13, 2024
- Advertisement -

నేను స్టిల్‌ వర్జిన్‌ మేడమ్‌..

- Advertisement -

అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమా త‌రువాత మ‌నోడికి వ‌ర‌స పెట్టి సినిమాలలో అవ‌కాశాలు వ‌స్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ చేతిలో అర‌డ‌జ‌ను సినిమాలు ఉన్నాయి అంటే మనోడి క్రేజ్ ఏవిధాంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.తాజాగా విజ‌య్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. కన్నడ క్యూటీ రష్మిక మందనతో కలిసి కాస్త వెరైటీగా గీత గోవిందం చిత్ర ప్రమోషన్‌లో మనోడు పాల్గొంటున్నాడు.

వారిద్దరి సరదా సంభాషణలతో ఫ్యాన్స్‌ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తూ కాస్త తేడా పోస్టర్‌నే వదిలారు. ‘మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్‌ స్టేటస్‌ మాత్రం ఇదే మేడమ్‌’ అంటూ పోస్టర్‌ను ఉంచాడు. పోస్టర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘ఐ యామ్ 25 స్టిల్‌ వర్జిన్‌ మేడమ్ అంటూ గోవిందం(విజయ్‌).. గీత(రష్మిక)ను ఓరగా చూస్తున్నాడు. గీత గోవిందం ఆగష్టు 15న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు టాక్సీవాలా, నోటా చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు విజ‌య్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -