- Advertisement -
అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ సమంత. తరువాత వీరిద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు. అయితే వీరి మధ్యలో మరో అమ్మాయి వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజ జీవితంలో కాదులేండీ.! ప్రస్తుతం నాగచైతన్య సమంత ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నారు. పెళ్లి తరువాత వీరిద్దరూ కలిసి నటించబోయే సినిమా ఇదే.
అయితే కథ ప్రకారం ఇద్దరు భార్యభర్తలైన చైతు-సమంతా మధ్యలోకి మరో అమ్మాయి రావడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడుతుందట. తమ ప్రేమ కారణంగా ఈ జంట ఎలా కలిసుంటుందనేదే ఈ సినిమా కథ. భార్య, భర్తల ప్రేమ విలువ చెప్పే పాయింట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
