Tuesday, April 16, 2024
- Advertisement -

కబీర్ సింగ్ సినిమా నేనెందుకు చూడాలి అంటున్న విజయ్ దేవరకొండ

- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అదే సినిమాని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. సందీప్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. నిజానికి షూటింగ్ మొదలు కాక ముందు నుంచే విజయ్ దేవరకొండ ‘కబీర్ సింగ్’ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నట్లు చాలాచోట్ల చెప్పుకొచ్చాడు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ సినిమా ఇంకా చూడలేదు అని చెబుతూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు.

“తెలుగులో ఆ సినిమా నేనే చేశాను. నాకు ఆ సినిమా కథ కూడా తెలుసు. మళ్లీ నేను ఎందుకు ఆ సినిమా చూస్తాను? ఆ సినిమాలో షాహిద్ కపూర్ తన పాత్రకి ప్రాణం పోసి చాలా బాగా నటించాడు. నాకు సినిమా చూడాలి అవసరం లేదు” అని విజయ్ దేవరకొండ అందరికీ షాకిచ్చాడు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా కంటే ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల పరంగా ఇంకా పెద్ద హిట్ అయింది. కేవలం ఆరు కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా 25.8 కోట్ల షేర్ ను సాధించగా 50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -