టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, గీతా గోవిందం బ్యూటీ రష్మిక మందనా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నా సినిమా డియర్ కామ్రేడ్. గీతా గోవిందం వంటి బ్లాక్ బాస్టర్ తరువాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్ర యూనిట్. టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమాలోని మొదటి సాంగ్ ను విడుదల చేశారు.
‘నీ నీలి కన్నుల్లోని ఆకాశమే..” అంటూ సాగే ఈ మెలోడీని గౌతం భరద్వాజ్ పాడారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాలేజ్, పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కథ సాగుతోందని ప్రచారం జరుగుతోంది. సినిమాను మే 31న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
- Advertisement -
మొదటి సాంగ్ ను విడుదల చేసిన డియర్ కామ్రేడ్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -