Sunday, April 28, 2024
- Advertisement -

విజయ్ దేవరకొండ బ్యాడ్ న్యూస్.. ‘లైగర్’ టీజర్ వాయిదా!

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. నటించిన చిత్రాలు పెళ్లిచూపులు తర్వాత అర్జున్ రెడ్డి తో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలతో వరుస విజయాలు అందుకున్నాడు. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ టీజర్ రిలీజ్ చేస్తారని ఆశపడ్డారు రౌడీ ఫ్యాన్స్. ‘లైగర్’ టీజర్ రిలీజ్ ను వాయిదా వేశారు.

విజయ్ దేవరకొండ పుట్టినరోజు అయిన మే 9న ‘లైగర్’ టీజర్ విడుదల చేస్తారని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు మనదేశం ఉన్న పరిస్థితుల్లో టీజర్ రిలీజ్ కరెక్ట్ కాదని యూనిట్ భావించింది. అందుకే ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది. పవర్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ భయానకంగా ఉందని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అలాగే అందరూ వాక్సిన్ వేయించుకుని ఆరోగ్యంగా ఉండాలని హీరో విజయ్ దేవరకొండతో పాటు పూరి అండ్ టీమ్, ధర్మ ప్రొడక్షన్స్ కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -