Saturday, April 27, 2024
- Advertisement -

సోనూ సూద్ ఫౌండేషన్ కు సారా అలీఖాన్ భారీ విరాళం.. ఎంతంటే?

- Advertisement -

బాలీవుడ్‌ నటుడు, రియల్ హీరో సోనూ సూద్‌ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరో అభాగ్యులకు తన వంతు సేవలు అందించి కలియుగ కర్ణుడిగా ముద్ర వేసుకున్నాడు.కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు, వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది.ఇలా ఆపద కాలంలో ఎంతో మందికి సాయం చేసి అందరి మన్ననలు పొందాడు. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండి అధిక సంఖ్యలో మరణాల రేటు ఉండడంతో బాలీవుడ్ ప్రముఖులు కరోనా బాధితులకు సాయం అందించడానికి ముందుకు వస్తున్నారు.అందులో ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌ సోనూసూద్‌కు మద్దతుగా నిలిచి సోనూసూద్‌ ఫౌండేషన్‌కు విరాళం అందించింది. సారా అలీఖాన్‌ను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. ఇలాంటి మంచి పనులు కొనసాగించు. యువతకు నువ్వు ఆదర్శంగా నిలిచావు’ అని ప్రశంసించారు.

Also read:ఆ స్టార్ హీరోలపై కన్నేసిన నిధి అగర్వాల్… మాములు జోరు కాదుగా!

రుద్ర ఫౌండేషన్‌ సహకారంతో దిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్లను సమకూర్చారు ప్రముఖ నటి రవీనా టాండన్‌. ఆమె ట్విటర్‌ వేదికగా ‘సముద్రంలో ఓ నీటి బొట్టులా చిన్న సాయం. కొందరి అవసరాన్నైనా తీరుస్తాయని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.అలాగే విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు ketto వెబ్‌సైట్‌ ద్వారా కొవిడ్‌పై పోరుకు నడుంబిగించారు.రూ.2 కోట్లు విరాళంగా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.7 కోట్ల విరాళాలు సమకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇప్పటికి 3.6 కోట్లు సమకూరాయని విరాట్‌ కోహ్లీ-అనుష్క దంపతులు ఇస్టాగ్రామ్‌ వేదికగా తెలియజేస్తూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం గర్వించదగ్గ విషయమే..

Also read:మా నాన్నకు పిచ్చి ఉండేది అంటూ షాకింగ్ విషయం చెప్పిన అనసూయ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -