Sunday, April 28, 2024
- Advertisement -

అమ్మ కోసమే పుట్టిన అద్భుత పాటలు.. వింటే మైమర్చిపోతారు!

- Advertisement -

ఈ అనంతమైన విశ్వంలో మానవ మనుగడ కొనసాగుతుంది అంటే అందుకు కారణం అమ్మ. అమ్మ లేనిది ఈ విశ్వంలో ఏ ప్రాణి లేదు. అమ్మ ఒక త్యాగమూర్తి, దానశీలి, అమ్మ అని పిలిస్తే తన పిల్లల కోసం ఎంతటి సాహసానికైనా ఒడిగడుతుంది. తన బిడ్డలపై ఇంత మమకారాన్ని చూపించే ఆ తల్లికి నేడు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.

అమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ మన తెలుగు సినిమాలలో ఎంతోమంది రచయితలు ఎంతో అద్భుతంగా పాటలు రాశారు. ఈ క్రమంలోనే చంద్రబోస్ తన కలం నుంచి జాలువారిన పాట “పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ”అనే పాట ఎంతో అద్భుతంగా రాశారు. మనకు ఏ చిన్న దెబ్బ తగిలినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా ముందుగా మన నోటి నుంచి వెలువడే పదం అమ్మ.

“తరగని బరువైన వరమనే అనుకుంటూ.. తనువున మోశావే అమ్మా’’ అంటాడు రామజోగయ్య శాస్త్రి.. కేజీఎఫ్ సినిమాలో రోజురోజుకు కడుపులో బరువు పెరుగుతున్న అది తనకు ఒక వరంగా భావిస్తుందని భావించేది ఈ సృష్టిలో అమ్మ మాత్రమే. అందుకే మనం ఎటువంటి పనులు చెప్పినా అది తనకు ఏమాత్రం కాదని తల్లి మాత్రమే భావిస్తుంది.

Also read:బిగ్ బాస్ సీజన్ 5 ఏ నెలలో వస్తుందో తెలుసా?

బిచ్చగాడు సినిమాలో అమ్మను గురించి”కోట్ల సంపద అందించినా… నువ్విచ్చే ప్రేమ దొరకదమ్మా. నా రక్తమే ఎంతిచ్చినా నీ త్యాగలనే మించునా.. నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా’’ అంటూ రచయిత భాషాశ్రీ మనం ఎంత ఎదిగినా అమ్మ ఒడిలోనే ఆనందం దొరుకుతుంది అని అద్భుతంగా తెలిపారు.

Also read:ఆ స్టార్ హీరోలపై కన్నేసిన నిధి అగర్వాల్… మాములు జోరు కాదుగా!

 ‘‘అమ్మా .. అమ్మా… నే పసి   వాడ్నిమ్మా… నువ్వే లేక వసివాడానమ్మా!’’ అని ‘రఘువరన్‌ బీటెక్‌’ సినిమాలు ఈ పాట వింటే ప్రతి ఒక్కరికి అంట కన్నీళ్లు వస్తాయి. అంత అద్భుతంగా ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు. ఈ విధంగా మరెన్నో అద్భుతమైన అమ్మ గొప్పతనాన్ని తెలిపే పాటలు ఎంతగానో మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -