Tuesday, April 30, 2024
- Advertisement -

అర్జున్ రెడ్డి తర్వాత్ విజయ్ సినిమా ఇదే

- Advertisement -

పెళ్లి చూపుల సినిమాతో మంచి విజయం సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు అర్జున్ రెడ్డి తో వచ్చి.. యూత్‍ని తెగ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఎవరు ఊహించని రేంజ్ లో హిట్ అవ్వడమే కాకుండా.. ఊహించని కలెక్షన్స్ వసూల్ చేస్తోంది. దాంతో ఇప్పుడు విజయ్ దేవరకొండకు సూపర్ క్రేజ్ వచ్చింది.

దాంతో విజయ్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ గీత ఆర్ట్స్ బ్యానర్ లో పరుశురాం దర్శకత్వం ఓ సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ వచ్చి ఆకర్షించగా.. దర్శకుడు పరుశురాం అల్లు అరవింద్ తో మాట్లాడి.. విజయ్‍ని హీరోగా తన సినిమాకి తీసుకున్నారు. ఆ తర్వాత లావణ్య త్రిపాటి ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దాంతో దర్శక నిర్మాతలు విజయ్ కోసం కన్నడ బ్యూటీ రష్మిక ను రంగంలోకి దింపారు. చూడగానే తన నవ్వుతో ఆకట్టుకునే ఈ భామా మొదటి సినిమాతోనే కన్నడలో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఓ మంచి సెలెబ్రేటి అయిపొయింది.

కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాతో వెండితెరకి పరిచయమైంది. ఇప్పుడు ఈ కిరిక్ పార్టీని తెలుగులో నిఖిల్ రీమేక్ చేస్తున్నాడు. ఇక రష్మీక మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండ సరసన నటించడం.. గీతా ఆర్ట్స్‌ సంస్థలో నటించేందుకు సంతకం చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయ్‌ స్పందిస్తూ.. ‘చిత్ర యూనిట్‌లో మీరు (రష్మిక) ఉండటం సంతోషంగా ఉంది. ఇక కిర్రాక్‌ మ్యాజిక్‌ చేద్దాం’ అని ట్వీట్‌ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -