- Advertisement -

అర్జున్ రెడ్డి హీరోయిన్ పై కామెంట్స్ చేసిన శ్రావ్యారెడ్డి

- Advertisement -

అర్జున్ రెడ్డి మూవీ ఏ టైంలో స్టార్ట్ అయిందో కానీ.. విడుదలకి ముందు నుంచి వివాదాలు మొదలు అయ్యాయి. ఎంపీ వీహెచ్ దగ్గర నుంచి యాంకర్ అనసూయ వరకు ఈ మూవీ అసభ్యకరమైందంటూ ఘాటు విమర్శలు చేశారు. తాజాగా వీరి జాబితాలోకి మరో నటి వచ్చి చేసింది. ఆమె ఎవరో కాదు శ్రావ్యారెడ్డి.

‘ఇజం’ సినిమాలో జర్నలిస్ట్‌ పాత్రలో నటించిన ఈ అమ్మడు.. అర్జున్ రెడ్డి మూవీపై సంచలన కామెంట్స్ చేయడంతో పాటు ఇందులో హీరోయిన్ గా నటించిన షాలినీ పాండేని ఏకిపారేసింది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా.. నేను చూసిన అతికొద్ది సినిమాల్లోనూ నాకు తలనొప్పి తెప్పించిన వాటిల్లో మొదటి ప్లేస్ లో ఉంది. అసలు రెడ్డి ఫ్యామిలీకి చెందిన వాళ్లు తమ పేరు చివరన దేశ్‍ముఖ్ అని పెట్టుకోరు. ఒక వేల పెట్టాలనుకుంటే.. అర్జున్ దేశ్‍ముఖ్ రెడ్డి అని పెట్టుకోండి. కానీ ‘అర్జున్ రెడ్డి దేశ్‌ముఖ్’ సరైంది కాదు. ఇది నాకు అసలు నచ్చలేదు.. అలా పేరు పెట్టడాన్ని నేను వ్యతిరేకిస్తున్నని ఆమె చెప్పింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన షాలినీపాండే ఫేస్‌కి యుద్ధాలు చేసేంత, డ్రగ్ అడిక్ట్ అయ్యేంత సీన్ లేదు’ అని ఈ సినిమాపై, హీరోయిన్‌పై ఫేస్‌బుక్ వేదికగా శ్రావ్యారెడ్డి మండిపడింది. అంతే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ ని కూడా వదలలేదు.

అసలు ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నారు..? లవ్ ఫెయిల్ అయితే ఏకంగా లైఫ్ నే ఫెయిల్ చేసుకోమనా..? అంటూ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగను ప్రశ్నించింది. ఇలా ఈ విధంగా శ్రావ్యా చేసిన కామెంట్స్ కి కొందరు నెటింజన్లు మద్దతు తెలిపితే.. ఈ సినిమా ఫ్యాన్స్ మాత్రం ఏకీపారేశారు. ‘నీకంటే ఆ హీరోయినే వందరెట్లు మేలు’ అంటూ శ్రావ్యాని ఫ్యాన్స్ తిడుతున్నారు. మరి శ్రావ్యా రెడ్డి చేసిన కామెంట్స్ పై అర్జున్ రెడ్డి టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -