హీరో విజయ్ దేవరకొండ ఒక్క సినిమాతో ఎంత క్రేజ్ సంపాందించాడో మనందరికి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్‌కు ముందు పెళ్లి చూపులు సినిమా తప్ప మరో సినిమాలో మనోడు ఉన్నట్లు కూడా ఎవరికి తెలియదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు విజయ్.ఈ సినిమా తరువాత మనోడు చేసే సినిమాలపై అంచనాలు పెరిగాయి.విజయ్ కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు.విజయ్ తాజా చిత్రం టాక్సీవాలా సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేసి .. అందులో భాగంగా ‘డ్రీమ్ బిహైండ్ ‘టాక్సీవాలా’ పేరుతో ఒక వీడియోను వదిలారు.
‘అర్జున్ రెడ్డి’ తరువాత ఏది ఎంపిక చేసుకోవాలో తెలియక తాను సతమతమైపోతుంటే, ఓ నలుగురు ఆకతాయి పిల్లలు తన కలలోకి వచ్చారని విజయ్ దేవరకొండ చెప్పాడు. వాళ్లే ‘టాక్సీవాలా’ స్క్రిప్ట్ చేయమని చెప్పారనీ .. అందువల్లనే చేశానని అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఆసక్తిని రేపుతూ .. ఈ సినిమా కోసం వెయిట్ చేసేలా చేస్తోంది.షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదల చేయడానికి సన్నాహలు చేస్తున్నారు చిత్ర యూనిట్.