Thursday, May 9, 2024
- Advertisement -

సమంత స్వ‌భావం గురించి చెప్పిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ టెన్ మూవీస్ అని లెక్క తేలిస్తే.. అందులో చేరిపోయిన మూవీ అర్జున్ రెడ్డి. ఆ సినిమా ఎలాంటిదైనా మైల్ స్టోన్ మూవీలో లీడ్ క్యారెక్టర్ చేయటం.. దాంతో వచ్చిన క్రేజ్ బ్యాగేజ్ ను వెంట పెట్టుకోకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తిత్వం విజయ్ దేవరకొండ సొంతం.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌హాన‌టిలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. తన పాత్రకు ఉండే ప్రాధాన్యత అంతంతమాత్రమే అయినప్పటికీ.. పెద్దగా పట్టించుకోకుండా చేసిన మూవీ మహానటి ఈ రోజు విడుద‌ల అయ్యింది. ఈ రోజే విజయ్ దేవరకొండ బర్త్ డే కూడా. తన పుట్టిన రోజున విడుదలవుతున్న మహానటి ఫలితం మీద చాలానే హోప్ప్ పెట్టుకున్నాడు.

ఈ సినిమాలో సీనియర్ నటి సమంతతో జత కట్టటం గురించి రియాక్ట్ అయిన విజయ్.. శామ్ తో కలిసి జత కడతానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. సమంతలాంటి స్టార్ తో నటించడం చాలా సరదాగా అనిపించిందని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. సమంత ఎప్పుడూ హుషారుగా ఉంటుందని, జోక్స్ వేస్తూ నవ్విస్తుంటుందని చెప్పారు.

మొదట జెమినీ గణేషన్ పాత్ర కోసం దుల్కర్ సల్మాన్ ను సంప్రదిస్తే… డేట్స్ కుదరక ఆయన ఒప్పుకోలేదని… దీంతో, తనను చేయాలని నాగ్ కోరాడని చెప్పాడు. అయితే, జెమినీ పాత్రను తాను పోషించగలనా అనే భయం ఉండేదని… కానీ, మళ్లీ దుల్కర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, తాను తప్పించుకున్నానని తెలిపాడు. చివరకు విజయ్ ఆంటోని పాత్రలో సెటిల్ అయ్యానని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -