Thursday, May 9, 2024
- Advertisement -

మహానటి రివ్యూ….

- Advertisement -

176 నిమిషాల నిడివిగ‌ల మ‌హాన‌టి సినిమా సావిత్రి మ‌ర‌ణానికి సంబంధించిన కొన్ని స‌న్ని వేశాల‌తో ప్రారంభం అవుతుంది. సావిత్రికేసుకు సంబంధించిన వివ‌రాల సేక‌ర‌ణ‌కు అక్కినేని స‌మంత విలేక‌రి పాత్ర‌లో ఎంట్రీ ఇస్తుంది. సావిత్రి జీవిత క‌థ‌ను వివ‌రించే పాత్ర‌లో సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ ఎంట్రీ ఇస్తాడు. జీవిత చ‌రిత్ర క‌థ‌ను వివ‌రించే భాగంలోనే సావిత్రి పాత్ర‌లో నిజంగానే సావిత్రి అన్న‌ట్లుగా కీర్తి సురేష్ ఎంట్రీ ఇస్తుంది. సావిత్రికి వేర్నేరు వ్య‌క్తుల‌తో ఉన్న పరిచ‌యాల‌ను చూపిస్తూ ఉన్న స‌మ‌యంలో సావిత్రికి పెద్ద‌నాన్న‌గా రుజేంద్ర ప్రసాద్ ఎంట్రీ.. అంద‌మైన లొకేష‌న్ల‌లో ఆగిపో బాల్య‌మా అనే పాట ఫోటోగ్ర‌ఫిక్ చాలా అందంగా చిత్రీక‌రించారు. ఆ త‌ర్వాత సావిత్రికి యుక్త వ‌య‌సు రావ‌డం… రంగ‌స్థ‌లం న‌టిగా ప‌రిచ‌యం అవ్వ‌డం, ఏఎన్ఆర్ పాత్ర‌లో నాగ‌చైత‌న్య‌, జెమినీ గ‌ణేష్ పాత్ర‌లో దుల్కర్ సల్మాన్ ఎంట్రీ ఇస్తారు.

సావిత్రి సినిమా ప్ర‌యానంలో పెద్ద పెద్ద ద‌ర్శ‌కుల‌ను చూపించే పాత్ర‌లో క్రిస్ శ్రీనివాస్‌, అవ‌స‌రాల‌, న‌వ‌దీప్‌రెడ్డి, ఎంట్రీ ఇస్తారు. సావిత్రి వెండి తెర‌కు ప‌రిచ‌మ‌యై జెమినీ గ‌ణేష్‌, సావిత్రిల మ‌ద్య ప్రేమ చిగురించి ట్విస్ట్‌తో ఇంట‌ర్ వెల్ ప‌డుతుంది.

సెకెండాఫ్‌లో జెమినీ గ‌ణేష్‌, సావిత్రిల వివాహం మెలోడి సాంగ్‌తో సెకెండాఫ్ మొద‌ల‌వుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చిన విబేధాల‌ను క‌ల్ల‌కు క‌ట్టిన‌ట్లు ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా చిత్రీక‌రించారు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట‌ర‌యిన సావిత్రికి స్టార్ ఇమేజ్‌, ఫ్యాన్ పాలోయింగ్ పెరిగిపోతుంది. సివిత్రి జీవితంలో మ‌ష్లాలు మొద‌ల‌యి ట్రాజెడీ వైపు తీసుకెల్లాడు ద‌ర్శ‌కుడు. మ‌ద్యానికి బానిస అయిన సావిత్రి జీవితంలో మ‌రిన్ని మ‌లుపులు చోటు చేసుకొని జీవిత పోరాటాన్ని మొద‌లుపెట్టి మ‌రిన్ని ట్విష్ట్‌ల‌తో క్లైమాక్స్ దిశ‌గా తీసుకెల్లారు. సావిత్రి మ‌ర‌ణం సంబంధించిన స‌న్నివేశాల‌తో చిత్రం ముగుస్తుంది.

సావిత్రిగా కీర్తి సురేష్ అద్భుతంగా నటించారు. మహానటిగా కీర్తి సురేష్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. కచ్చితంగా అవార్డులు సైతం వచ్చేలా కీర్తి నటన ఉంది. ఇక సినిమాలో వాణి, విజయ్ ల నటన బాగుంది. సమంత కూడా క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో బాగా నటించింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ బాగా చేశాడు. ఇక ఏయన్నార్ గా నాగ చైతన్య సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్వీయార్ గా మోహన్ బాబు, దర్శక నిర్మాత చక్రపాణిగా ప్రకాశ్ రాజ్, కెవి చౌదరిగా రాజేంద్ర ప్రసాద్, క్రిష్ లాంటి నటులు నిజ పాత్రలకు ఏమాత్రం తీసిపోకుండా నటించడం జరిగింది

ఇక సెన్సార్ నుండి ఒక్క సింగిల్ కట్ కూడా లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ మహానటి జీవితం తెరచిన పుస్తకమైనా.. ఆ విశేషాలన్నీ వెండితెరపై చూడాలంటే ‘మహానటి’ చూడాల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -