Friday, May 3, 2024
- Advertisement -

ఆ విషయంలో మళ్ళీ తల దూర్చను అంటున్న విజయ్ దేవరకొండ

- Advertisement -

వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న యువ హీరో విజయ్ దేవరకొండ కు ‘డియర్ కామ్రేడ్’ సినిమా డిజాస్టర్ అవ్వడంతో బ్రేకులు పడ్డాయి. భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే సినిమా విడుదలకు ముందే భరత్ కమ్మని సరిగ్గా పని చేయనివ్వకుండా విజయ్ దేవరకొండ ప్రతి సన్నివేశంలోనూ తలదూర్చి కొన్ని రీ షూట్ లు కూడా చేయించాడని వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ లో కూడా మార్పు వచ్చిందట. ఇక సినిమా టేకింగ్ విషయాన్ని దర్శకులకు వదిలేయాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ తో బిజీగా విజయ్ దేవరకొండ షూటింగ్ వరకు మాత్రమే తను చూసుకుంటానని ఆ తరువాత ప్రమోషన్లకు హాజరవుతానని చెబుతున్నాడు. అంతే తప్ప సినిమాలో దర్శకత్వం విషయాలలో ఇంకా ఇన్వాల్వ్ అవద్దోని విజయ్ నిర్ణయించుకున్నాడట. దర్శకత్వంలో విజయ్ చేసిన మార్కులు ఎలా వచ్చాయో లేదో తెలియదు కానీ ప్రమోషన్స్ మరియు మార్కెట్ విషయంలో మాత్రం విజయ్ దేవరకొండ స్ట్రాటజీ లు అన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. కానీ ఈసారి ప్రమోషన్లలో పాల్గొనడం తప్ప విజయ్ దేవరకొండ ప్లాన్స్ ఏమి వేయనని చెబుతున్నాడు మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -