Sunday, April 28, 2024
- Advertisement -

రేపు ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జైట్లీ అంత్యక్రియలు..

- Advertisement -

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే ఆయన మృతిపట్ల ప్రధాని మోదీతో పాటు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. అరుణ్ జైట్లీ భైతికి కాయానికి రేపు అంత్యక్రియలు జరగనున్నాయి. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు .

ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు. పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం ఆయన అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -