Monday, May 6, 2024
- Advertisement -

విజయ్‌ దేవరకొండని ఎవరు తొక్కేస్తున్నారు!

- Advertisement -

విజయ్ దేవరకొండ..టాలీవుడ్ సెన్సేషన్. పెళ్లి చూపులు కంటే ముందు రెండు మూడు సినిమాలు చేసినా అవి అంతగా గుర్తింపు ఇవ్వలేదు. కానీ ఒక్క పెళ్లి చూపులు సినిమా విజయ్‌ని క్లాసిక్‌ హీరోగా నిలబెట్టింది. తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం వంటి సినిమాలతో టాలీవుడ్‌ని షేక్ చేశాడు. అయితే చేసింది కొద్ది సినిమాలే అయినా అగ్రహీరో రేంజ్‌లో గుర్తింపు వచ్చింది విజయ్‌కి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే చిన్న లాజిక్‌ని మిస్సయ్యారు విజయ్‌.

ఇదే విజయ్‌ కొంపముంచింది. వరుస ఫ్లాప్‌లు దానికి తోడు విజయ్ నోటిదూల వెరసీ కెరీర్ మొత్తం రిస్క్‌లో పడింది. ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ యాట్యిట్యుడ్‌లో బాగా చేంజ్ వచ్చింది. తన మాట తీరే కాదు డ్రెస్సింగ్ స్టైల్ విషయంలోనూ క్లారిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో విజయ్ ఓవరాక్షన్ చూస్తే ప్రతిఒక్కరికి చిర్రెత్తుకొస్తుంది. అందుకే ఇదే ఓవరాక్షన్ లైగర్ సినిమాపై పడి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. లైగర్ సినిమా ప్రమోషన్‌లో ఇండియాను షేక్ చేస్తానని భారీ డైలాగులు కొట్టాడు. సినిమా విడుదల తర్వాత నెటిజన్లు విజయ్‌ని ఆటాడుకున్నారు.

ఆ తర్వాత విజయ్‌లో కొంతమార్పు కనిపించింది. ఇక తాజాగా ఖుషి సినిమా సక్సెస్‌ మీట్‌ సందర్భంగా విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. మా ఖుషి మీద ఫేక్ బీఎంఎస్ రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం కొంతమంది డబ్బులు కూడా ఖర్చు చేయిస్తున్నారు అని సెన్సేషన్ కామెంట్స్ చేశారు.ఇంతకి విజయ్‌ని తొక్కాలని చూస్తున్నది ఎవరు అన్నదానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. నెటిజన్లు మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదని సూచిస్తున్నారు. అయితే విజయ్ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో కానీ రానున్న సినిమాలపై ఏ విధమైన ఎఫెక్ట్ పడుతుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -