Friday, May 3, 2024
- Advertisement -

చంద్రబాబుకి ఏమైంది?

- Advertisement -

టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబుకు టైం అస్సలు బాలేదు. ఓ వైపు ఐటీ నోటీసులు..మరోవైపు సర్వేలు అధికార వైసీపీకి అనుకూలం. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మళ్లీ నిరాశే ఎదురవుతందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ విజయం సాధిస్తుందని కొన్ని సర్వేలు తేల్చిచెప్పడంతో టీడీపీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. దీనికి తోడు ముందస్తు వస్తే బాబు సంగతి అంతే.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా అంటే ట్రోలింగ్‌కు కేరాఫ్‌గా మారుతున్నాయి. గెలిచే అవకాశం లేదన్న భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదు. రాష్ట్ర రాజధాని పోలవరం అంటూ నోరు జారారు. అంతే ఓటమి భయంతో చంద్రబాబు మైండ్ సెట్ చేంజ్ అయిందని వైసీపీ నేతలు ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అయితే గతంలో పలుమార్లు చంద్రబాబు నోరుజారిన సందర్భాలు ఉన్నా ప్రస్తుతం ఎన్నికలకు టైం దగ్గరపడుతుండటంతో ఇది వైసీపీకి బలంగా మారింది. దీనికి తోడు బాబు తనయుడు లోకేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నోరుజారడం తర్వాత దానిని కవర్ చేసేందుకు నానా తంటాలు పడటం ఆయనకు అలవాటే.

ఇక ఇటీవల బీజేపీతో పొత్తు కోసం బాబుగారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ నిమిత్తం వెళ్లి పొత్తు చర్చలు జరిపారు. ఇక తిరిగి ఏపీకి వచ్చాక కాసింత హ్యాపీగా కూడ ఉండగా అది క్షణకాలమే అయింది. అమిత్ షాతో భేటీ తర్వాత కూడా ఐటీ నోటీసులు అందుకోవడం బాబును నిరాశలో ముంచేశాయి. చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలు ఇబ్బందులు పడుతుండగా అసలు మా అధినేతకు ఏమైంది అంటూ ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానించే పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -