Saturday, April 27, 2024
- Advertisement -

మళ్లీ రాజకీయాల్లోకి సమంత..?

- Advertisement -

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇలా దేశంలో వెండితెరపై అలరించిన నటీనటులు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రజాక్షేత్రంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్,ఎంజీఆర్,జయలలిత లాంటి వారు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. వీరి స్పూర్తితో ఎంతోమంది యువనటులు పార్టీ స్ధాపించి రాజకీయాల్లో సత్తాచాటారు…ఇంకా ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు.

ఇక దక్షిణాదిన సినీరంగం నుండి రాజకీయాల్లోకి రావడం ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా సినీ నటి సమంత పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. సమంతను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు తెగ ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. ఆమె బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించి స్టార్ క్యాంపెయిన్‌గా ప్రచారం నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తోందట.

వాస్తవానికి తెలంగాణ ప్రజలతో సమంతకు మంచి రాపో ఉంది. నేతన్నలకి మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాదు తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ సమంత. ఈ నేపథ్యంలోనే సమంత పేరు తెరమీదకు వచ్చింది. బీఆర్ఎస్‌లో త్వరలో సమంత చేరనున్నారని తెలంగాణతో పాటు బీఆర్ఎస్ పలు రాష్ట్రాల్లో పోటీ చేయనుండగా ఆయా రాష్ట్రాల్లో సమంతతో ప్రచారం చేస్తే పార్టీకి కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. ఇందుకోసం సమంతను సంప్రదించారని కూడా తెలుస్తోంది.

అయితే వాస్తవానికి సమంత పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన 2018లోనే వార్తలు వచ్చాయి. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి బరిలోకి సమంత బరిలోకి దిగడం ఖాయమైందని ప్రచారం జరుగగా కొద్దిరోజుల తర్వాత అవి పుకార్లేనని తేలిపోయాయి. తాజాగా మళ్లీ సమంత పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి మరోసారి వార్తలు ప్రచారం జరుగుతుండగా అయితే ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని సమంత సన్నిహితులు చెబుతున్నారు.

వాస్తవానికి సమంతకు రాజకీయాల్లోకి రావడం ససేమిరా ఇష్టం లేదు. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కొద్దిరోజులు సినిమాలకు విశ్రాంతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ రూమర్స్ రాగా దీనిపై సమంత లేదా ఆమె సన్నిహితులు అధికారిక ప్రకటన వస్తే తప్ప పుకార్లకి చెక్ పడేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -