Sunday, April 28, 2024
- Advertisement -

సోషల్ మీడియాలో విజయ్ ఓ సెన్సేషన్‌!

- Advertisement -

విజయ్ దేవరకొండ..టాలీవుడ్ సెన్సేషన్. నువ్విలా సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన విజయ్ ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి మెప్పించారు. తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేసినా అంతగా గుర్తింపు రాలేదు.

అయితే తర్వాత వచ్చిన పెళ్ళి చూపులు సినిమాతో ఓవర్ నైట్‌లో స్టార్ హీరో అయిపోయారు. ఈ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు విజయ్. ఇక చిన్న సినిమాలకు పెళ్ళి చూపులు ఓ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచింది.

ఆ తర్వాత తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌లో దూసుకుపోతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్ విజయ్. తాజాగా తన ఫాలోవర్స్ సంఖ్య 21 మిలియన్స్‌కు చేరుకుంది. తన కెరీర్ గురించే కాదు కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, సమాచారం అందిస్తుంటారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుండగా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -