పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం గూటికి చేరారు ఎంపీ వెంకటేష్ నేత, మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎన్ నేత మన్నె జీవన్ రెడ్డి. వీరికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వాగతం పలికారు.
అనంతరం ఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలవగా వీరిని అభినందించారు ఖర్గే. త్వరలోనే మరికొంతమంది ఎంపీలు ,ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.
వెంకటేష్ నేత కాంగ్రెస్ నుండే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2018లో చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి విజయఢంకా మోగించారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకు టికెట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.
