Sunday, April 28, 2024
- Advertisement -

రెండో స్థానంలో టీమిండియా!

- Advertisement -

ఉప్పల్ టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా. ఈ విజయంతో 5 టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. విశాఖ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో విజయం సాధించింది టీమిండియా. ఇక ఈ గెలుపులో ప్రధాన బాధ్యత కుర్రాళ్లదే. ఎందుకంటే జట్టులో రోహిత్ మినహా స్టార్ ఆటగాళ్లు ఎవరు లేకపోయినప్పటికి చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు యువ ఆటగాళ్లు. ముఖ్యంగా జైస్వాల్, గిల్ సెంచరీలతో రాణించి జట్టును గెలిపించడంలో కీ రోల్ పోషించారు.

ఇక ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపిచన్ షిప్‌లో తిరిగి రెండో స్థానానికి చేరుకుంది టీమిండియా. ఉప్పల్ టెస్టులో ఓటమి తర్వాత ఐదో స్థానానికి పడిపోయిన రోహిత్ సేన తాజా విజయంతో ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా.. మూడో స్థానంలో సౌతాఫ్రికా జట్టు ఉంది. ఇక రాజ్ కోట్ వేధికగా జరిగే మూడో టెస్ట్ లో విజయం సాధిస్తే టీమిండియాకు తిరుగు ఉండదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -