అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ మొత్తన్ని తనవైపు తిప్పుకున్న హీరో విజయ్ దేవరకొండ.అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ చేసే సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.అర్జున్ రెడ్డి తరువాత ఏ మంత్రం వేసావే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర ఫెయిల్ కావడంతో విజయ్ అభిమానలు చాలా నిరాశకు గురైయ్యారు. కాని ఈ సినిమా ఫలితం విజయ్ తరువాత సినిమాల మీద పడలేదు.ప్రస్తుతం విజయ్ రెండు సినిమాలతో ప్రేక్షకులకు రాబోతున్నాడు.ఒకటి ట్యాక్సీవాలా,రెండోది మహనటి ఈ రెండు సినిమాలతో సందడి చేయనున్నాడు విజయ్ దేవరకొండ.
రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టాక్సీవాలా సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. టాక్సీవాలా టీం ఏప్రిల్ 17న టీజర్ ను రిలీజ్ చేస్తోంది. టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్‌చేస్తూ ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ లో కండలు తిరిగిన బాడీతో సూపర్బ్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమా మే మూడోవారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Because I'll give you the unexpected. Presenting to you the Swaggest Stress Busting Thriller you have ever seen. #TaxiwaalaTeaser pic.twitter.com/yxDenv3UlJ
— Vijay Deverakonda (@TheDeverakonda) April 14, 2018