హీరో విజయ్ దేవరకొండ సినిమాలకు లీకుల బాధ తప్పడం లేదు.ఆయన తాజాగా నటించిన గీతా గోవిందం సినిమా విడుదలకు ముందే నెట్‌లో ప్రత్యక్ష్ అయి అందరికి షాక్ ఇచ్చింది.సినిమా ప్రీ ప్రొడక్షన్ టైంలో సినిమా టీం సభ్యుడు సినిమాలో కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయినప్పటికీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. సీన్స్ లీకైనా సినిమా విజయం సాధించడం పట్ల చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది. తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయింది.విజయ్ దేవరకొండ టాక్సీవాలా సినిమా వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ స్టేజ్‌లో ఉంది.ఈ లోపే ఈ సినిమా హెచ్‌డి ప్రింట్ నెట్‌లో వైరల్ అవుతుంది.యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్ని సోషల్ మీడియా నెట్ వర్క్స్ లో సినిమాను అప్లోడ్ చేశారు.దీంతో చిత్ర నిర్మాతలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెల్ల కమల్, భార్గవ్ కుమార్, బీఆర్ పేర్లతో ఉన్న జీమెయిల్ ఐడీలకు సంబంధించిన గూగుల్ డ్రైవ్ నుండి సినిమా షేర్ అవుతుందని కంప్లైంట్ లో పేర్కొన్నారు.ఇప్పటికే గీతా గోవిందం లీక్ కావడంతో తీవ్ర నిరాశలో ఉన్న విజయ్ దేవరకొండకు టాక్సీవాలా సినిమా మొత్తం నెట్‌లో ఉందని తెలియగానే షాక్ గురైయ్యాడని తెలుస్తుంది.మరి ఈ సినిమా పైరసీ నుంచి ఎలా సేవ్ అవుతుందో చూడాలి.