Monday, May 13, 2024
- Advertisement -

నాది ల‌క్ ఫేవ‌ర్ కాదంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమా త‌రువాత విజ‌య్ వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌చ్చి ప‌డ్డాయి.వాటిలో చాల సెలెక్టీవ్‌గా సినిమాలు చేసుకుంటు ముందుకు పోతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఆయ‌న తాజాగా న‌టించిన గీతా గోవిందం సినిమా విడుద‌లై సూప‌ర్ హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే.ఈ సినిమా 100 కోట్ల క్ల‌బ్‌లో చేరినట్లు చిత్ర నిర్మాత‌లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.అయితే కెరీర్ పీక్స్‌లో ఉంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.కొంద‌రు విజ‌య్‌కు ల‌క్ ఫేవ‌ర్ ఎక్కువుగా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ కామెంట్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించారు.పెళ్లి చూపులు సక్సెస్ వెనుక టీమ్ చేసిన కృషి చాలా ఉందని హీరోయిన్ రీతూ వర్మ మొదలుకుని దర్శకుడు తరుణ్ భాస్కర్ వరకు అందరి కృషి కష్టం ఫలించడం వల్లే ఆ సినిమా అంత‌టి విజయం సాధించింద‌ని తెలిపాడు.పెళ్లి చూపులుకు ముందు నేను కూడా అవ‌కాశాలు కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని అప్పుడు నాకు ఏ ల‌క్ ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని చెప్పుకొచ్చాడు.. విజయ్ దేవరకొండ అన్న దాంట్లో లాజిక్ లేకపోలేదు. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి షూటింగ్ టైం లో గీతా ఆర్ట్స్ ఒప్పందం చేసుకుంది. ఇక విజ‌య్ న‌టిస్తున్న టాక్సీవాలా,నోటా సినిమాలు విడుద‌ల‌కు సిద్దం అవుతున్నాయి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -