‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ నటనకు ఆ తర్వాత వరుస సినిమాలు వచ్చి పడుతున్నాయి. వాటన్నింటికి విజయ్ సైన్ చేస్తూ తన డేట్స్‌ను ఒక్క రోజు గ్యాప్ లేకుండా సినిమాలకు ఇచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడు. గీతా4 బ్యానర్‌పై నిర్మించిన ‘టాక్సీవాలా’ హర్రర్ జోనర్ ఇతివృత్తంలో సినిమా వస్తోంది. ఈ సినిమా తర్వాత పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో సినిమా రాబోతుంది.
ఆపైన మైత్రీ మూవీస్ బ్యానర్‌లో స్టూడెంట్ యూనియన్లు, రాజకీయాల ఇతివృత్తంలో ఓ సినిమా రానుంది. ఇప్పుడు తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తమిళ నిర్మాత జ్ఞాన్‌వేల్ రాజా నిర్మించే సినిమాను సోమవారం (మార్చి 5) ప్రారంభించారు. ఈ సినిమా ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉండనుంది అని సమాచారం.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ డైరక్టర్ ఆనంద్ శంకర్ చెప్పిన పాయింట్ నచ్చేసి సినిమాను వెంటనే మొదలుపెట్టేశాడు. అయితే ఈ సినిమాలో రాజకీయ నాయకుడు తండ్రిగా తన కొడుకును ఏ విధంగా రాజకీయాల్లోకి లాగాడు, ఆ తండ్రి కొడుకుల మధ్య కాన్ ఫ్లిక్ట్, వర్తమాన రాజకీయాలు ఇతివృత్తంలో సినిమా కథ దర్శకుడు రూపొందించుకున్నాడని సమాచారం. ఆ రాజకీయ నాయకుడి కొడుకు పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.
ప్రస్తుతం విజయ్ నటించిన సినిమాలు మూడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఏ మంత్రం వేసావే’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ (టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. పరిశీలిస్తున్నారు.)
https://www.youtube.com/watch?v=z09-Z2crBxk