సర్కారు వారి పాటకు గుడ్‌న్యూస్

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేశ్ మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఇప్పటికే విడుదలైన కళావతి సాంగ్.. యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

మ మ మషేషా.. సాంగ్ కూడా అదరగొట్టింది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మే 12 విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీకి తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, ఎయిర్ కండిషన్, సాధారణ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారం రోజుల పాటు సినిమా టికెట్ల ధరలను పెంచుకునే వీలు కల్పించింది. మే 18 వరకు వారం రోజుల పాటు 5 షోలకు అనుమతి ఇచ్చింది.

కొత్త వాదన తెరపైకి తెచ్చిన హీరో సిద్ధార్థ్

చిరంజీవితో రాధిక మూవీ

సొంత జెట్ ఫ్లయిట్ ఉన్న టాలీవుడ్ స్టార్స్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -