Monday, May 6, 2024
- Advertisement -

భారీ టార్గెట్‌తో వ‌స్తున్న ‘గీత గోవిందం’

- Advertisement -

‘అర్జున్ రెడ్డి’ తర్వాత విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న ‘గీత గోవిందం’పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్ర బృందం తమకు తాముగా ప్రమోషన్లు మొదలుపెట్టడానికి ముందే దీనికి మంచి హైప్ వచ్చేసింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి రెస్ప‌న్స్ వ‌చ్చింది. మ‌రో మూడు రోజులు విడుద‌ల కానున్న ఈ సినిమా భారీ టార్గెట్‌నే పెట్టుకుంది.ఓవ‌ర్ఆల్‌గా ఈ సినిమా 15 కోట్లు క‌లెక్ట్ చేయలాట‌.. ఈ సినిమా మేకింగ్‌కు దాదాపు ఇంత ఖర్చు అయినట్టుగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఈ మేరకు వసూళ్లను తిరిగి రాబట్టుకుంటే ‘గీతగోవిందం’ హిట్ అని చెప్పవచ్చని అంటున్నారు. థియేటరికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో ఈ డబ్బును రాబట్టు కోవాల్సి ఉంది ‘గీతగోవిందం’. ఇప్పటికే ఉన్న క్రేజ్‌ను పరిశీలించి చూస్తే.. ఈ స్థాయి మొత్తాన్ని రాబట్టుకోవడం ఈ సినిమాకు ఏ మాత్రం కష్టం కాదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వారాంతంలో విడుదలైన ‘శ్రీనివాస కళ్యాణం’.. ‘విశ్వరూపం-2’ చిత్రాలకు డివైడ్ టాక్ వచ్చింది. అవి వచ్చే వారం వరకు నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజవుతుండటం ‘గీత గోవిందం’కు కలిసొచ్చే విషయం. దీనికి పోటీగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. మ‌రి విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న మ్యాజిక్‌ను మ‌ళ్లీ రిపీట్ చేస్తాడో లేదో చూడాలి అంటే మ‌రో మూడు రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -