Sunday, May 19, 2024
- Advertisement -

500 థియేట‌ర్లలో సినిమా ఇక్క‌డ కాదు విదేశాల్లో

- Advertisement -

ఓవ‌ర్సీస్‌లో టాక్సీవావా విడుద‌ల‌కు ప్ర‌య‌త్నాలు

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కావ‌డంతో ఎండ వేడిమి నుంచి థియేట‌ర్‌లో కూర్చొని ఏసీలో రెండు కూల్‌డ్రింక్‌లు తాగేసి హ్యాపీగా సినిమా చూస్తుండ‌డం తెలుగువారికి అల‌వాటు. అందుకే ఈ వేస‌విలో పెద్ద పెద్ద సినిమాలు విడుద‌ల‌వుతాయి. ఈ వేస‌విలో రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, అల్లు అర్జున్ త‌దిత‌రులు త‌మ సినిమాల‌తో వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాను కూడా రావాల‌ని అనుకుంటున్నా సినిమా థియేట‌ర్లు దొర‌క‌క‌పోవ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్సీస్‌పై క‌న్నేశాడు.

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇటీవ‌ల న‌టించిన ఓ సినిమా అడ్ర‌స్ లేకుండా పోయినా అర్జున్‌రెడ్డి ముందు అది కనిపించ‌లేదు. ఇప్పుడు తాను న‌టించిన సినిమా టాక్సీవాలా. గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రూపొందించిన టాక్సీవాల సినిమాను ఓవ‌ర్సీస్‌లో భారీగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ వేశారు.

కనీసం 500 థియేటర్లలో ట్యాక్సీవాలాను విడుదల చేయాలని చూడ‌గా తెలుగు రాష్ట్రాల్లో కుద‌ర‌లేదు. ఆ స‌మ‌యంలో చాలా సినిమాలు వ‌స్తున్నాయి. దీంతో ఓవర్సీస్‌పై క‌న్నేశారు. ఇంత భారీగా విజయ్ దేవరకొండ మూవీ విడుదల చేయాలని చూస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.మే 11వ తేదీన విజయ్ దేవరకొండ న‌టించిన సినిమా టాక్సీవాలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -