Monday, May 6, 2024
- Advertisement -

తమ్ముడి కోసం గొంతు సాయం చేస్తున్న విజయ్

- Advertisement -

విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ రిలీజ్ పనుల్లో బిజీ గా ఉన్నాడు. మరో పక్క క్రాంతి మాధవ్ దర్శకత్వం లో ఒక కొత్త చిత్రాన్ని కూడా చేయనున్నాడు. వరుస సినిమాల తో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు తన తమ్ముడి కెరీర్ ని కూడా ఒక ట్రాక్ లో పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది.

సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర శ్రీధర్ రెడ్డి మరియు యాష్ రంగినెని సంయుక్తం గా నిర్మించిన సినిమా దొరసాని. ఈ సినిమా కి దర్శకుడు కే అర్ మహేంద్ర. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఈ సినిమా తో హీరో గా తెరంగేట్రం చేస్తుండగా రాజశేఖర్ జీవిత దంపతులు చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ ఈ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేస్తుంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే అందరి దృష్టి ని ఆకర్షించిన విషయం మనకి తెలిసిందే.

తాజా సమాచారం మేరకు విజయ్ దేవరకొండ ఈ సినిమా ని నరేట్ చేయనున్నాడు అట. దీనికి సంబందించిన వాయిస్ ఓవర్ పనులు ఇటీవలే పూర్తి అయినట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ ఎప్పుడో ముగియగా పోస్ట్ ప్రొడక్షన్ పన్లు మాత్రం ఇంకా పూర్తికాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -